![]() |
![]() |

మెలోడీ బ్రహ్మ మణిశర్మ దగ్గర సహాయకుడిగా పనిచేసిన అనుభవం యువ సంగీత సంచలనం తమన్ సొంతం. అందుకే.. అవకాశం దొరికినప్పుడల్లా గురువుపై తన అభిమానాన్ని చాటుకుంటుంటారు తమన్. అలాంటి ఈ గురుశిష్యులిద్దరూ 2021 సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు.
మణిశర్మ సంగీత సారథ్యంలో రూపొందిన 'రెడ్' చిత్రం 2021 ముగ్గుల పండక్కి విడుదల కానుండగా.. తమన్ స్వరకల్పనలో తెరకెక్కిన 'క్రాక్' కూడా పతంగుల పర్వదిన సమయంలో వినోదం పంచనుంది. మరి.. మణిశర్మ వర్సెస్ తమన్ అన్నట్లుగా సాగనున్న ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
తమిళ చిత్రం 'తాడమ్' ఆధారంగా రూపొందిన 'రెడ్' లో రామ్ హీరోగా నటించగా.. 'క్రాక్' లో రవితేజ కథానాయకుడు.
![]() |
![]() |