![]() |
![]() |

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ 3తో కథానాయికగా తొలి అడుగేసింది సయీ మంజ్రేకర్. బాలీవుడ్ దర్శకనటుడు మహేష్ మంజ్రేకర్ తనయగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. ఆ చిత్రాలే.. మేజర్, గని. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా ఒకే నెలలో నాలుగు వారాల గ్యాప్ లో సందడి చేయబోతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. అడివి శేష్ కథానాయకుడిగా శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్న మేజర్ జూలై 2న థియేటర్స్ లో సందడి చేయనుండగా.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా గని జూలై 30న జనం ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల్లోనూ సయీ మంజ్రేకర్ నటనకు అవకాశమున్న పాత్రల్లోనే దర్శనమివ్వనున్నట్లు సమాచారం.
మరి.. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ఒకే నెలలో వారాల వ్యవధిలో సందడి చేయనున్న సయీకి ఆయా చిత్రాలు ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తాయో చూడాలి.
![]() |
![]() |