![]() |
![]() |

పంజా వైష్ణవ్ తేజ్ రూపంలో తెలుగు తెరపై మరో మెగా కాంపౌండ్ హీరో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయితేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్.. 'ఉప్పెన' చిత్రంతో ఫిబ్రవరి 12న కథానాయకుడిగా అదృష్టం పరీక్షించుకోనున్నాడు. గత ఏడాది వేసవిలోనే రావాల్సిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆలస్యమైంది. ఎట్టకేలకు మరో పది రోజుల్లో వెండితెరపై వెలుగులు పంచనుంది.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి నెల వైష్ణవ్ తేజ్ అన్నయ్య సాయితేజ్ కి అన్ లక్కీ మంత్ అనే చెప్పాలి. ఎందుకంటే.. గతంలో ఫిబ్రవరిలో విడుదలైన సాయితేజ్ రెండు చిత్రాలు.. 'విన్నర్', 'ఇంటిలిజింట్' బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో.. వైష్ణవ్ తేజ్ అయినా సక్సెస్ చూస్తాడేమో చూడాలి.
కాగా, 'ఉప్పెన'ని నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు.
![]() |
![]() |