![]() |
![]() |

ఫైర్‌బ్రాండ్ యాక్ట్రెస్‌గా పేరుపొందిన బాలీవుడ్ తార కంగనా రనౌత్ తన ఫ్యామిలీ, రెలెటివ్స్ విషయంలో ఎంతో ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. తన అక్క రంగోలి చందేల్, తమ్ముడు అక్షత్‌తో పాటు మరో ఇద్దరు కజిన్స్‌కు చండీగఢ్‌లో ఫ్లాట్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. పాష్ లొకాలిటీలో ఉన్న ఈ ఫ్లాట్స్ విలువ 4 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
తోబుట్టువులకు ఎంతో సపోర్టివ్‌గా ఉండే కంగన, ఇప్పుడు చండీగఢ్‌లో ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో, చుట్టూ మాల్స్, రెస్టారెంట్స్ ఉండే ఏరియాలో ఈ ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసి వారికిచ్చిందని ఆమె క్లోజ్ సర్కిల్స్ తెలిపాయి. చండీగఢ్ సిటీలో సొంత ఇల్లు అమర్చుకోవాలనేది కంగన అక్కాతమ్ముళ్లతో పాటు ఆమె కజిన్స్ డ్రీమ్. ఆ డ్రీమ్‌ను కంగన నెరవేర్చిందని ఆ సోర్సెస్ చెప్పాయి.
సోషల్ మీడియాలో అనేక అంశాలపై తన వాయిస్‌ను కుండబద్దలు కొట్టినట్లు వినిపిస్తుంటే కంగన.. తన బ్రదర్స్, సిస్టర్స్‌పై ఏమాత్రం మాట పడనీయదు. అన్ని విషయాల్లోనూ వారిని ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంటుంది. ఇటీవలే తన తమ్ముడు అక్షత్ పెళ్లిని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిపించింది కంగన. ఆ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూస్తే చాలు.. అది ఎంత ఆర్భాటంగా జరిగిందో అర్థమైపోతుంది. అవి సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి కూడా.
కాగా కంగన నటించిన ఇంట్రెస్టింగ్ మూవీస్ ఒకదాని తర్వాత ఒకటిగా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వాటిలో ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత క్యారెక్టర్ చేసిన 'తలైవి' మూవీతో పాటు, 'తేజస్', 'ధాకడ్' సినిమాలున్నాయి. అలాగే 'మణికర్ణిక' మూవీకి సీక్వెల్‌ను ప్లాన్ చేస్తోంది కంగన.
![]() |
![]() |