![]() |
![]() |

ఒక దశలో రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా.. ఇలా ఇంగ్లిష్ టైటిల్స్ తోనే సందడి చేశాడు యువ కథానాయకుడు శర్వానంద్. అయితే, ఆ తరువాత మాత్రం ఎందుకనో పూర్తిగా ట్రాక్ మార్చేశాడు. మరీ ముఖ్యంగా.. శతమానం భవతి నుంచి ఇంగ్లిష్ టైటిల్స్ పై మోజు తగ్గించాడు. తెలుగుదనం ఉట్టిపడేలా టైటిల్స్ ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు.
శతమానం భవతి తరువాత రాధ, మహానుభావుడు, పడి పడి లేచె మనసు, రణరంగం, జాను (జానకి అనే పేరుకి సంక్షిప్త నామం).. ఇలా తెలుగు టైటిల్స్ తోనే పలకరించాడు శర్వానంద్. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న తన కొత్త చిత్రాలు శ్రీకారం, మహా సముద్రం, ఆడాళ్ళూ మీకు జోహార్లు కూడా తెలుగుదనం మేళవించిన శీర్షికలే.
మొత్తమ్మీద.. శర్వానంద్ గత కొంతకాలంగా ఇంగ్లిష్ టైటిల్స్ తో తనకు సక్సెస్ రేట్ బాగున్నా కానీ.. తెలుగు టైటిల్స్ పైనే కన్నేయడం వార్తల్లో నిలుస్తోంది. మరి.. శర్వాని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చే సినిమా వీటిలో ఏదవుతుందో చూడాలి.
![]() |
![]() |