![]() |
![]() |

బుల్లితెర ప్రేక్షకులకు హాట్ ఫేవరేట్ సీరియల్ 'కార్తీక దీపం'. పరిటాల నిరుపమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సీరియల్‌కి వంటలక్క దీప పాత్రలో నటించిన ప్రేమి వైద్యనాథ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్‌కి ఆమె ప్రధాన బలంగా నిలిచింది. వంటలక్కకు ఈ సీరియల్ ద్వారా స్టార్ హీరోయిన్ ల తరహాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
గత కొన్ని నెలలుగా రసవత్తరంగా సాగుతున్న ఈ సీరియల్ తాజాగా కీలక మలుపులు తిరుగుతూ మహిళా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. బుధవారం ఎపిసోడ్ కీలక మలుపులతో రొమాంటిక్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగబోతోంది. శౌర్య తనతో టిఫిన్ చేయాలని వుందని చెప్పడంతో కలిసి టిఫిన్ చేద్దామని చెప్పి డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చిన కార్తీక్‌కి మోనిత ఫోన్ చేస్తుంది. తనతో టిఫిన్ చేయడానికి రావాలని మోహమాట పెడుతుంది. దాంతో, "రౌడీ.. ఈ పూటకి తాతయ్య నానమ్మలతో కానిచ్చెయ్" అంటూ కార్తీక్ కారు తీస్తాడు. ఇంతలో దీపి (వంటలక్క) స్కూటీపై వస్తూ కనిపిస్తుంది.
ఇదేంటి ఇక్కడ దీనికి అస్సలు దొరక్కూడదని కారు స్టార్ట్ చేసి స్పీడు పెంచేస్తాడు. కార్తీక్ ని వెంబడించి ఓవర్ టేక్ చేస్తుంది దీప.. దీప వెళ్లిపోయిందని అనుకున్న కార్తిక్ కారుని వెనక్కి తిప్పి హాస్పటల్‌కి వెళతాడు. అక్కడ డాక్టర్స్ అంతా గుంపుగా వుండటంతో అక్కడి వెళ్లి చూస్తే కాలుమీద కాలు వేసుకుని కళ్లజోడు పెట్టుకుని మిల్క్ షేక్ తాగుతూ దీప "ఇదీ జరిగింది" అంటుంది. దీపని అలా చూసిన కార్తీక్ ఇదేంటి ఇక్కడుందని షాకవుతాడు.
ఆ తరువాత హస్పిటల్‌లో తన పెళ్లి.. డాక్టర్ బాబు తనతో ఎంత అన్యోన్యంగా వుంటాడో వంటి విషయాల్ని హాస్పిటల్ స్టాఫ్‌కి చెప్పేస్తుంది. జరుగుతున్న తంతు చూసి విసుక్కున్న డాక్టర్ బాబుకి మోనితతో నీ పెళ్లి జరగదని.. ఎందుకంటే అది జైలుకి వెళుతుందని చెప్పి షాకిస్తుంది దీప. కార్తీక్ షాక్‌లో వుండగానే వెళ్లిపోతూ రొమాంటిక్‌గా చూస్తూ ఫ్లయింగ్ కిస్‌లతో దీపి ఆటపట్టించడం ఈ రోజు ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలవబోతోంది.
![]() |
![]() |