![]() |
![]() |
.jpg)
మాస్ మహారాజ్ రవితేజ, మ్యాచ్ హీరో రానా దగ్గుబాటి హీరోలుగా ఒక మల్టీస్టారర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మంచి విజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాను వీళ్ళిద్దరూ హీరోలుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ రీమేక్ చేయనుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా రీమేక్ చేయాలని ట్రై చేశారు. ప్రయత్నాలు ఫలించకపోవడంతో రవితేజ, రానా హీరోలుగా చేస్తున్నారు. హీరోలిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డైరెక్టర్, టెక్నీషియన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ప్రొడక్షన్ హౌస్ పడింది.
రవితేజ, రానాను డైరెక్ట్ చేసే ఛాన్స్ సాగర్ చంద్ర కు దక్కిందని సమాచారం. నారా రోహిత్, శ్రీ విష్ణు హీరోలుగా 'అప్పట్లో ఒకడుండేవాడు' వంటి హిట్ సినిమాను ఈ డైరెక్టర్ తీశాడు. 'అయ్యారే' అనే సినిమా కూడా చేశాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాలో ఇగో క్లాష్ నేపథ్యంలో సన్నివేశాలను బాగా డీల్ చేసాడు. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' కూడా ఇగో క్లాష్ నేపథ్యంలో నడిచే సినిమా. అందుకని అతడిని దర్శకుడిగా ఎంపిక చేశారట.
![]() |
![]() |