![]() |
![]() |

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం పాలైన కొద్ది రోజుల తర్వాత అతని సన్నిహిత స్నేహితురాలు, '1.. నేనొక్కడినే' హీరోయిన్ కృతి సనన్.. అతని చుట్టూ నడుస్తోన్న చర్చలపై విమర్శలు గుప్పించింది. ఆ చర్చల్లో ఎక్కువగా ఊహాగానాలు, నిందలు, సుశాంత్ సహనటులను ట్రోల్ చేయడం ఉంటున్నాయని ఆమె ఆక్రోశించింది. ముంబై పోలీసుల దర్యాప్తు ప్రకారం సుశాంత్ డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసిందే.
ఐదు పేజీల ఇన్‌స్టాగ్రామ్ నోట్‌లో, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ తమ కెరీర్ కోసం పోరాడుతున్నారనీ కాబట్టి, ఇతరుల గురించి జనం మాట్లాడడం ఆపేయాల్సిన సమయం వచ్చిందని కృతి రాసింది. సుశాంత్ సరసన ఆమె 'రాబ్‌తా' మూవీలో నటించింది.
"బ్లేమ్ గేమ్ అనేది ఎన్నటికీ ముగియదు. ఎవరి గురంచైనా చెడుగా మాట్లాడటం ఆపేయండి. వదంతుల్ని ఆపండి, అవన్నీ మీకు తెలుసనే ఆలోచన మానండి, మీ అభిప్రాయం కరెక్టనే ఆలోచన మానండి. మీకేం తెలుసు.. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఫైట్ చేస్తూనే ఉన్నారు. మీ నోటి నుంచి వచ్చే ఏ ప్రతికూల మాటైనా, ఏ ట్రోలింగ్ అయినా, ఏ రాద్ధాంతం అయినా మీరేమిటనేది చూపుతుంది కానీ, వారేమిటనేది చూపదు. చాలా మంది దీన్ని విస్మరిస్తుంటారు. ఒక చెత్త కామెంట్ చేయడం మీకు బాధ అనిపించకపోయినా, అవతలి వాళ్ల కంటే ఎక్కువగా అది మిమ్మల్ని అంతర్గతంగా ప్రభావితం చేస్తుంది" అని రాసుకొచ్చింది కృతి.
బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగానే డిప్రెషన్‌కు గురై సుశాంత్‌సింగ్ బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ ఒక వర్గం తీవ్రంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కృతి సనన్ ఇన్‌స్టాగ్రామ్ నోట్ ఆ విమర్శలకు సమాధానమని మరో వర్గం అంటోంది.
![]() |
![]() |