![]() |
![]() |

'చిచ్చోరే' థియేటర్లలో విడుదలైన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమాగా చరిత్రలో మిగిలిపోనుంది. అతడు హీరోగా నటించిన చిట్టచివరి సినిమా థియేటర్లలోకి కాకుండా ఓటీటీలో విడుదల కానుంది. 'చిచ్చోరే' తరవాత సుశాంత్ నటించిన, 'డ్రైవ్' నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది. 'డ్రైవ్' తరవాత అతడు నటించిన సినిమా 'దిల్ బేచారా'. ఇందులో సైఫ్ అలీ ఖాన్ స్పెషల్ రోల్ చేశాడు. సుశాంత్ స్నేహితుడు, బాలీవుడ్ లో ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చబ్రా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.
'దిల్ బేచారా' సినిమాను జూలై 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ విడుదల చేస్తోంది. సుశాంత్ పైలోకాలకు వెళ్లిన నేపథ్యంలో ఈ ఇసినిమా థియేటర్లలో విడుదలైతే బావుంటుందని అతడి అభిమానులు, సాధారణ ప్రేక్షకుల అభిలాష. అయితే, ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఓటీటీకి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా విషయంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ క్యాష్ చేసుకోవాలని అనుకోకపోవడం అభినందించదగ్గ పరిణామం. సబ్‌స్క్రిప్షన్ ఉన్న సభ్యులకు మాత్రమే కాకుండా అందరికీ సినిమాను చూసే అవకాశం కల్పిస్తోంది.
![]() |
![]() |