![]() |
![]() |

అక్కినేని ఫ్యామిలీకి సన్నిహితురాలు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఫిట్ నెస్ ఎక్స్పర్ట్ శిల్పారెడ్డి కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించిన శిల్పా రెడ్డి, భర్తతో కలిసి హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నట్లు తెలిపారు.
శిల్పా రెడ్డి చేసిన పనిని సమంత మెచ్చుకున్నారు. సమాజంలో తనకున్న పరువు ప్రతిష్టలను పక్కనపెట్టి, వివాదాలు వచ్చే డేంజర్ ఉన్నప్పటికీ తనను తాను కరోనా పాజిటివ్ అని చెప్పుకోవడానికి చాలా గట్స్ కావాలని సమంత ప్రశంసించారు. తామంతా గర్వపడేలా శిల్పారెడ్డి మంచి పని చేశారని ఆమె అన్నారు.
"ఈరోజు శిల్పారెడ్డి కి కరోనా వచ్చింది. రేపు నాకు రావచ్చు. ఎవరికైనా రావచ్చు. ఈ కష్టకాలంలో మనమంతా ఒకరికి ఒకరు అండగా నిలబడాలి" అని సమంత పేర్కొన్నారు. కరోనా గురించి శిల్పారెడ్డి చెప్పిన అనుభవాలను నాగార్జున ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను సమంత షేర్ చేశారు.
![]() |
![]() |