![]() |
![]() |

లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి కోలుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వచ్చారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని సొంతిటిలో ఆమె సృహ తప్పి పడిపోవడంతో సన్నిహితులు యశోద ఆసుపత్రిలో జాయిన్ చేశారు. తొలుత ఆమె పరిస్థితి ఆందోళనకరమనే అనే వార్తలు వచ్చాయి. మెదడులో రక్తనాళాలకు సంబంధించిన అరుదైన వ్యాధి వచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించిన వైద్యులు, రెండు రోజుల తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఆతర్వాత వార్డు కు షిఫ్ట్ అయ్యారు. బుధవారం సంజనా రెడ్డిని డిశ్చార్జ్ చేశారని తెలిసింది. 'అయామ్ బ్యాక్' అని ఆవిడ ట్వీట్ కూడా చేశారు. కరణం మల్లేశ్వరితో తీసుకున్న సెల్ఫీ పోస్ట్ చేశారు.
రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'రాజుగాడు' చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన సంజనా రెడ్డి, ప్రస్తుతం కరణం మల్లేశ్వరి బయోపిక్ తెరకెక్కించే పనుల్లో ఉన్నారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమా స్క్రిప్ట్ రాయడం తోపాటు నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోనున్నారు. ఆరోగ్యంగా సంజనా రెడ్డి ఇంటికి రావడంతో ఆయన ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
![]() |
![]() |