![]() |
![]() |

కరోనా వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదనీ, కూల్‌గా మన పని మనం చేసుకుంటూ కొవిడ్19తో ఫైట్ చేయవచ్చని వర్కవుట్స్ చేయడం ద్వారా శిల్పారెడ్డి చెబుతున్నారు. రెండు రోజుల క్రితం తనకు, తన భర్తకు కోవిడ్19 పాజిటివ్ అని రిజల్ట్స్ వచ్చాయని, రెండు వారాల క్రితం తమ ఇంటికి వచ్చి వెళ్లిన ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా కరోనా సోకిందని స్వయంగా శిల్పారెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే.
శిల్పారెడ్డి దంపతులు హాస్పటల్స్‌కి వెళ్ళలేదు. హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి ఏం చేస్తున్నదీ శిల్పారెడ్డి సోషల్ మీడియా ఫాలోయర్లకు చెబుతున్నారు. కరోనా వచ్చిందని కుంగిపోవడం లేదు. కసరత్తులు చేయడం ఆపలేదు. శిల్పారెడ్డి వర్కవుట్స్ కూడా చేస్తున్నారు. వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కరోనా వచ్చిందని ఆందోళన చెందకుండా శిల్పారెడ్డిని ఫాలో అవ్వండి. ఫైట్ చేయండి.
![]() |
![]() |