![]() |
![]() |

అఖిల్ అక్కినేని టైటిల్ రోల్ చేసిన 'మిస్టర్ మజ్ను' మూవీ ఆశించిన రీతిలో బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. అయితే ఆ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. సేమ్ టైటిల్‌తో హిందీలో రిలీజ్ చేసిన ఆ సినిమాకి యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌పైగా వచ్చాయి. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశాడు.
'మిస్టర్ మజ్ను'లో విక్రమ్ అలియాస్ విక్కీగా అఖిల్, నిక్కీగా నిధి నటించారు. మాధవి అనే మరో కీలక పాత్రను ఇజాబెల్లే లీటే పోషించింది. విక్కీ అంటే మొదట మంచి అభిప్రాయం లేని నిక్కీ.. తర్వాత అతడి ప్రవర్తన, అతడి నిజాయితీ నచ్చి ఎలా ప్రేమలో పడుతుంది, తాత్కాలిక బంధాలే తప్ప శాశ్వత బంధానికి ఇష్టపడని విక్కీ చివరకు ఎలా మారాడనేది ఇందులోని ప్రధానాంశం. రావు రమేశ్, జయప్రకాశ్, నాగబాబు, సుబ్బరాజు, పవిత్రా లోకేశ్ కీలక పాత్రధారులు. ఎస్. తమన్ సంగీతం సమకూర్చగా, జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.
అఖిల్ ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇది హీరోగా అతని నాలుగో చిత్రం. ఇప్పటిదాకా హిట్ రుచి చూడని అతను ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. అతని జోడీగా టాప్ హీరోయిన్ పూజా హెగ్డే నటించిన ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్.
![]() |
![]() |