![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సంగీత దర్శకుడు తమన్ గిఫ్ట్ రెడీ చేశాడు. అయితే అది అది ప్రేక్షకుల ముందుకు రావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 9న మహేష్ పుట్టినరోజు. అది ఎంతో దూరంలో లేదు. ఆ రోజున 'సర్కారు వారి పాట' ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
'సర్కారు వారి పాట' సినిమాకు పరశురాం దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. అల్లు శిరీష్ హీరోగా అతని దర్శకత్వంలో వచ్చిన 'శ్రీరస్తు శుభమస్తు' విడుదలై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ట్వీట్ చేశారు. అన్నట్టు ఆ సినిమాకి కూడా సంగీత దర్శకుడు తమనే. పరశురాం ట్వీట్ ను కోట్ చేసిన తమన్ "9వ తారీకు కోసం ఎదురు చూద్దాం" అని చెప్పారు. పాట విడుదల ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారని టాక్.
ఇటీవల ఈ సినిమాలో టైటిల్ సాంగ్ అంటూ ఒక ఫేక్ సాంగ్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టింది. అందుకని ఈసారి ఒరిజినల్ టైటిల్ సాంగ్ విడుదల చేయాలని సినిమా టీమ్ రెడీ అయింది.
మహేష్, తమన్ కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన పాటలు అన్నీ హిట్టే. 'దూకుడు' ఈ సినిమాకి తమన్ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. 'బిజినెస్ మేన్' సినిమాలో పాటలతో పాటు నేపథ్య సంగీతం ఇరగదీశాడు. 'ఆగడు' సినిమా ఫ్లాప్ అయినా అందులో పాటలు బావుంటాయి. అప్పటి తమన్ వేరు. ఇప్పటి తమన్ వేరు. అప్పటికంటే ఇప్పుడు సూపర్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. అందుకని, 'సర్కారు వారి పాట' సినిమాలో పాటల పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
![]() |
![]() |