![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'క్రాక్', 'ఖిలాడి' చిత్రాల్లో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'క్రాక్' వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుండగా.. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఖిలాడి' 2021 వేసవికి రిలీజ్ కానుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. 'ఖిలాడి' కంటే ముందు రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో 'వీర' అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా కూడా 2011లో సమ్మర్ సీజన్ లోనే సందడి చేసింది. అయితే బాక్సాఫీస్ ముంగిట ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కట్ చేస్తే.. మళ్ళీ పదేళ్ళ తరువాత అదే సీజన్ లో 'ఖిలాడి' రానుండడం వార్తల్లో నిలుస్తోంది. మరి.. గతంలో అంతగా కలసి రాని వేసవి ఈ సారైనా రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ కి వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |