![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తాజాగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా మలయాళీ భామ ప్రయాగ మార్టిన్‌ని తీసుకున్నారు. రెండో కథానాయికగా కీలక పాత్రకు పూర్ణను తీసుకున్నారు. ఆమె కూడా మలయాళీ భామ కావడం విశేషమే. ఫస్ట్ హీరోయిన్‌కి పాతిక లక్షలు, సెకండ్ హీరోయిన్‌కి అందులో సగం పారితోషికంగా ఇస్తున్నార్ట. దీని వల్ల నిర్మాతకు కోటిన్నర లాభం చేకూరిందని ఫిల్మ్‌నగర్ గుసగుస.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర కథానాయికలుగా కొనసాగుతున్న భామలంతా ఒక్కో సినిమాకి కనీసంలో కనీసం కోటి రూపాయలు తీసుకుంటున్నారు. టాప్ ఫైవ్‌లో ఉన్న హీరోయిన్లు అయితే కోటిన్నర వరకూ తీసుకుంటున్నారు. అగ్రశ్రేణి కథానాయికల జాబితాకు కాస్త దిగువన ఉన్న భామలు 50, 60 లక్షలు రూపాయలు తీసుకుంటున్నారు. అగ్ర కథానాయిక కావాలని బాలకృష్ణ ఆర్డర్ చేసుంటే... నిర్మాత కచ్చితంగా తీసుకు వచ్చేవారు. కానీ, బాలకృష్ణ అలా కోరలేదు. కథానాయికల విషయంలో దర్శకుడు, నిర్మాతకు ఫ్రీహ్యాండ్ ఇచ్చారు. దాంతో తక్కువ పారితోషికం ఇచ్చి మలయాళ భామలు ఇద్దర్ని తీసుకున్నారు. దీని వల్ల నిర్మాతకు కోటిన్నర మిగిలింది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. సుమారు 65 నుంచి 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తున్నారని టాక్. అందులో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి పారితోషికాలే 25 నుంచి 30 కోట్ల రూపాయలు అని టాక్.
![]() |
![]() |