![]() |
![]() |

`ఊహలు గుసగుసలాడే` (2014)చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది సోయగం రాశీ ఖన్నా.. అనతికాలంలోనే తెలుగునాట తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు చేసిన రాశి.. ఇప్పటివరకు కేవలం మాస్ మహారాజా రవితేజ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో మాత్రమే జోడీ కట్టింది. `బెంగాల్ టైగర్` (2015), `టచ్ చేసి చూడు` (2018) చిత్రాల్లో రవితేజకి జంటగా కనువిందు చేసిన రాశి.. `జై లవ కుశ` (2017)లో తారక్ సరసన ఆడిపాడింది.
కట్ చేస్తే.. చాలా కాలం తరువాత ఈ ముద్దుగుమ్మకి మరో టాలీవుడ్ టాప్ స్టార్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కిందట. ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ఓ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ముగ్గురు కథానాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో ఇప్పటికే మాళవికా మోహనన్, కృతి శెట్టి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. మరో హీరోయిన్ గా రాశి ఎంపికైందని బజ్. త్వరలోనే ప్రభాస్ - మారుతి కాంబో ఫిల్మ్ లో రాశి ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
Also Read: 'గాడ్‌ఫాదర్'.. ఒక్క రూపాయి తీసుకోకుండా నటిస్తున్న సల్మాన్!
కాగా, ప్రభాస్ తో రాశికి ఇదే తొలి చిత్రం కాగా.. మారుతితో ఇదివరకు `ప్రతి రోజూ పండగే` (2019) చేసింది మిస్ ఖన్నా. అలాగే ప్రస్తుతం మారుతి డైరెక్ట్ చేస్తున్న `పక్కా కమర్షియల్`లోనూ రాశి ఖన్నానే హీరోయిన్.
![]() |
![]() |