![]() |
![]() |

మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ 'పుష్ప' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. భన్వర్ సింగ్ షెకావత్ గా ఆకట్టుకున్న ఆయన పుష్ప పార్ట్-2 లో మరింత అలరించనున్నాడు. ఇక త్వరలో ఆయన వైఫ్, మలయాళ హీరోయిన్ నజ్రియా ఫాహద్ కూడా తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. 'అంటే సుందరానికీ' సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఆమె లుక్ ని రివీల్ చేశారు మేకర్స్.
నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'అంటే సుందరానికీ'. ఇప్పటికే విదులైన నాని లుక్ కి, నాని బర్త్ డే టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సుందరంగా నాని నవ్వులు పూయించాడు. ఇక తాజాగా నజ్రియా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది మూవీ టీమ్. లీలా థామస్ గా నజ్రియా లుక్ ఆకట్టుకుంటోంది. చేతిలో కెమెరా పట్టుకొని దేనిని ఫోటో తీయాలా అని ఆలోచిస్తున్నట్లుగా ఉన్న నజ్రియా లుక్ క్యూట్ గా ఉంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ జూన్ 10 న థియేటర్స్ లో విడుదల కానుంది.
![]() |
![]() |