![]() |
![]() |

రి-ఎంట్రీలో `వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన చేతిలో `హరిహర వీరమల్లు`, `భవదీయుడు భగత్ సింగ్` సినిమాలున్నాయి. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ చిత్రానికి కమిట్ అయ్యారు పవన్. వీటితో పాటు `వినోదయ చిత్తమ్` రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. తాజాగా `స్వామి రారా` ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలోనూ ఓ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట పవన్. ఇందులో `ఉప్పెన` స్టార్ వైష్ణవ్ తేజ్ మరో హీరోగా నటించబోతున్నాడని టాక్. అంతేకాదు.. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించబోతున్నట్లు సమాచారం. అలాగే `భీమ్లా నాయక్` చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని నిర్మించనుందని.. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ క్రేజీ వెంచర్ సెట్స్ పైకి వెళుతుందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే పవన్ - సుధీర్ వర్మ కాంబో మూవీపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, సుధీర్ వర్మ తాజా చిత్రం `శాకిని ఢాకిని` విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆయన మాస్ మహారాజా రవితేజతో `రావణాసుర` తీస్తున్నారు. సెప్టెంబర్ 30న ఈ మూవీ రిలీజ్ కానుంది.
![]() |
![]() |