![]() |
![]() |

నితిన్ ఆదివారం రాత్రి షాలిని మెడలో మూడు ముళ్ళు వేశారు. ఏడడుగులు నడిచారు. ఆయన మూడు ముళ్ళు వేయడానికి కొన్ని గంటల ముందు పెళ్ళి కానుకగా ‘రంగ్ దే’ సినిమా యూనిట్ టీజర్ విడుదల చేసింది. ఒకవైపు రియల్ లైఫ్‌లో సంతోషంగా పెళ్ళి చేసుకోబోతున్న సమయంలో రీల్ లైఫ్‌లో పెళ్ళి చేసుకోవడానికి ఏడుపు ముఖం పెట్టే క్యారెక్టర్ చేసిన సినిమా టీజర్ విడుదల కావడం సంథింగ్ స్పెషల్ ఎటెంప్ట్ అని చెప్పాలి. అందువల్ల, టీజర్ చాలామందిని ఎట్రాక్ట్ చేసింది.
‘చెయ్ తీయ్ జస్టీస్ చౌదరి’, ‘నాన్నా... నవ్వుతోంది. నేను కట్టలేను నాన్నా’ వంటి డైలాగులు బాగా పేలాయి. టీజర్ హిట్టు అని చెప్పాలి. అయితే, ‘రంగ్ దే’లో హీరోయిన్ కీర్తి సురేశ్ లుక్స్‌కి మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది.
ఇంతకు ముందు ముద్దుగా, కొంచెం బొద్దుగా సౌతిండియన్ సుందరికి కేరాఫ్ అడ్రస్ అన్నట్టు కీర్తి సురేశ్ ఉండేవారు. ‘మహానటి’లో సావిత్రి పాత్రలో అలనాటి సావిత్రిని గుర్తు చేశారు. అటువంటి కీర్తి సురేశ్ ఈమధ్య బాగా బరువు తగ్గారు. బక్కచిక్కి సన్నజాజిలా మారారు. బహుశా... కీర్తి సన్నబడిన తర్వాత విడుదలైన తొలి సినిమా టీజర్ ఇదే అనుకుంట. ఆమె లీన్ లుక్ ప్రేక్షకులలో చాలామందికి నచ్చలేదు. కీర్తి ఇలా ఉందేంటని పెదవి విరిచారు. ఆమె కొత్త లుక్‌ను డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైమ్ తీసుకునేలా ఉన్నారు.
![]() |
![]() |