![]() |
![]() |

బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనమని తనను ఎవరూ సంప్రదించలేదనీ, తనకూ అందులో పాల్గొనే ఉద్దేశం లేదని నటి శ్రద్ధా దాస్ గతంలో ఓసారి స్పష్టం చేశారు. అయినా... రూమర్లు ఆగలేదు. కొన్ని వెబ్‌సైట్లలో (తెలుగువన్ డాట్ కామ్ కాదు) స్టార్ మా తెలుగు ఛానల్‌లో త్వరలో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్’ నాలుగో సీజన్‌లో హౌస్‌లో అడుగుపెట్టే కంటెస్టెంట్లలో శ్రద్ధా దాస్‌ను ఫైనలైజ్ చేశారని రాశారు. సదరు వార్తలపై శ్రద్ధా దాస్ మండిపడ్డారు.
‘‘తెలుగులో ‘బిగ్ బాస్’ షో కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. అందులో నేను భాగం కావడం లేదు. బిగ్ బాస్ గురించి అడుగుతూ చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. ఆల్రెడీ నా పేరు కన్ఫర్మ్ చేసినట్టు రాస్తున్నారు. ఏదైనా రాసేముందు పూర్తి వివరాలు తెలుసుకుని రాయండి. లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటా. మరోసారి ఈ విషయంలో స్పష్టత ఇస్తున్నా’’ అని శ్రద్ధా దాస్ పేర్కొన్నారు.
![]() |
![]() |