![]() |
![]() |

ప్రస్తుతం టాలీవుడ్‌లో 'వైల్డ్ డాగ్' మూవీలో ప్రధాన పాత్ర చేస్తోన్న అక్కినేని నాగార్జున.. దాని తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు అంగీకరించారు. వరుసగా 'చందమామ కథలు', 'గుంటూర్ టాకీస్', 'పీఎస్‌వీ గరుడవేగ' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రవీణ్‌కు నాగార్జునను డైరెక్ట్ చేసే అవకాశం రావడం బిగ్ బ్రేక్‌గా భావించవచ్చు. జూలై 27 ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణ్ దాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ మూవీని నిర్మించనున్నట్లు ప్రకటించారు.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తయారయ్యే ఈ సినిమాకు భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టగానే షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రానికి నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. కొంత కాలంగా కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్ చవిచూస్తోన్న నాగార్జునకు ప్రవీణ్ ఎలాంటి సినిమాని అందిస్తాడో చూడాలి.
![]() |
![]() |