![]() |
![]() |

రామ్‌గోపాల్ వర్మ 'మర్డర్' మూవీ ట్రైలర్ మంగళవారం ఉదయం విడుదల అవుతోంది. సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఆధారంగా ఈ మూవీని తీస్తున్నట్లు ఇదివరకే ఆర్జీవీ ప్రకటించారు. మితిమీరిన ప్రేమ చావును కోరుతుందనే పాయింట్ చుట్టూ 'మర్డర్' కథ నడుస్తుంది. ప్రధానంగా ప్రణయ్‌ను ప్రేమించిన అమృత, కూతుర్ని అమితంగా ప్రేమించిన మారుతీరావు పాత్రల మీదనే ఈ సినిమా ఫోకస్ చేయనుంది. తెరపై మారుతీరావు పాత్రను శ్రీకాంత్ అయ్యంగార్ పోషించాడు. "జూలై 28 మార్నింగ్ 9:08 గంటలకు 'మర్డర్' ట్రైలర్ రిలీజవుతుంది. మితిమీరిన ప్రేమ చంపుతుంది" అంటూ వర్మ ట్వీట్ చేశారు. దాంతో పాటు మారుతీరావు క్యారెక్టర్ ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు.
జూన్ 21న ఆర్జీవీ 'మర్డర్.. కుటుంబ కథా చిత్రమ్' ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. "ఇది అమృత, మారుతీరావు ఉదంతాన్ని ఆధారంగా చేసుకున్న గుండెను మెలితిప్పే కథ కాబోతోంది. తన కూతుర్ని ఓ తండ్రి అమితంగా ప్రేమించడంలోని డేంజర్లను ఈ సినిమా చూపుతుంది" అని రాసుకొచ్చారు. అప్పుడే ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలాన్ని సృష్టించింది. దీనిపై ప్రణయ్ తండ్రి కోర్టుకు కూడా వెళ్లారు. ఆనంద్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీని నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తుండగా, అనురాగ్ కంచర్ల సమర్పిస్తున్నారు.

![]() |
![]() |