![]() |
![]() |

పాయల్ రాజ్‌పుత్ ఈ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆల్మోస్ట్ నాలుగు నెలల తరవాత ఆమె కెమెరా ముందుకొచ్చారు. మేకప్ వేసుకున్నారు. "స్టార్ట్... కెమెరా... యాక్షన్... షాట్ ఓకే..." అని డైరెక్టర్ సౌండ్ విన్నారు. అదీ సంగతి! కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ నుంచి పాయల్ షూటింగులకు ప్యాకప్ చెప్పారు. మొదట ముంబైలోని తన ఫ్లాట్‌లో ఉన్నారు. ఆ తరవాత ఢిల్లీలోని తల్లితండ్రుల దగ్గరకు వెళ్ళారు. మధ్యలో షూటింగులను మిస్ అవుతున్నానని రెండుమూడుసార్లు పాయల్ చెప్పుకొచ్చారు. అయితే, సినిమా షూటింగులు మొదలు కాకపోవడంతో ఆమెకు కెమెరా ముందుకు వచ్చే అవకాశం దక్కలేదు. ఇప్పుడు యాడ్ ఫిలిమ్ చేసే అవకాశం వచ్చింది.
పాయల్ రాజ్‌పుత్ సోమవారం రాజస్థాన్ రాష్ట్రంలోని పింక్ సిటీ జైపూర్‌లో ఒక యాడ్ షూటింగ్ చేశారు. అమితానందంతో ఉప్పొంగారు. అలాగే, అక్కడి లోకల్ మీడియాకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇంతకు ముందు తాప్సీ సైతం ఒక యాడ్ ఫిలిమ్ షూటింగ్ చేశారు. విద్యా బాలన్ వంటి బాలీవుడ్ బ్యూటీలు యాడ్ ఫిలిమ్స్ చేయడమే కాదు... సినిమా షూటింగులకు సై అంటున్నారు.

![]() |
![]() |