![]() |
![]() |

ప్రపంచ సుందరి ఐశ్వరారాయ్ బచ్చన్‌కి కొవిడ్-19 టెస్ట్‌లో నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొన్ని రోజులు క్రితం ఆమె కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. బచ్చన్ ఫ్యామిలీలో తొలుత బిగ్ బి అబితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా సోకింది. తర్వాత ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కి కరోనా సోకింది. భర్త నుండి ఆమెకు కాంటాక్ట్ అయినట్టు అనుమానిస్తున్నారు. అలాగే, వాళ్ళిద్దరి కుమార్తె ఆరాధ్యకు కరోనా సోకింది.
మొదట తండ్రీకొడుకులు అమితాబ్, అభిషేక్ హాస్పటల్‌లో జాయిన్ అయ్యారు. పాజిటివ్‌గా తేలడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న ఐశ్వర్య, ఆరాధ్య ఆ తరవాత కొవిడ్ లక్షణాలు బయటపడటంతో హాస్పటల్‌లో జాయిన్ అయ్యారు. లేటెస్టుగా టెస్టులు చేయగా... ఐశ్వర్యారాయ్, ఆరాధ్యకు కరోనా నెగెటివ్ అని వచ్చింది. దాంతో అభిషేక్ చాలా సంతోషంగా ఉన్నారు. ట్వీట్ కూడా చేశారు.
‘‘మీ ప్రార్థనలు, విషెస్‌కి థాంక్యూ. ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఐశ్వర్యారాయ్, ఆరాధ్యకి నెగెటివ్ రిజల్ట్స్ వచ్చాయి. హాస్పటల్ నుంచి డిశ్చార్ట్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఇంటిలో ఉన్నారు. నేను, నాన్న హాస్పటల్‌లో మెడికల్ స్టాఫ్ అబ్జర్వేషన్‌లో ఉన్నాం’’ అని అభిషేక్ ట్వీట్ చేశారు.
![]() |
![]() |