![]() |
![]() |

టాలీవుడ్‌ను కరోనా స్కేర్ వదలనంటోంది. 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' టీమ్‌లను అది వెన్నాడుతున్నట్లే ఉంది. ఇదివరకు లాక్‌డౌన్ పీరియడ్‌లో రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు రెండూ కొవిడ్-19 బారినపడ్డాయి. అప్పుడు షూటింగ్ లేదు కాబట్టి సరిపోయింది. కొద్ది రోజులకు ఆ రెండు ఫ్యామిలీలు ఆ మహమ్మారి నుంచి సక్సెస్‌ఫుల్‌గా బయటపడ్డాయి. ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇద్దరు హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ కరోనా బారినపడటంతో షూటింగ్‌కు ఆటంకం ఏర్పడింది.
అంతేకాదు, చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న 'ఆచార్య'లో సెట్స్‌కు రావడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆ సినిమా షూటింగ్‌కూ దెబ్బ తగిలింది. ఇప్పటికే 'ఆచార్య' షూటింగ్‌కు పలుమార్లు ఆటంకాలు కలిగిన విషయం మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు చరణ్‌కు కొవిడ్ అని నిర్ధారణ కావడంతో మరోసారి షెడ్యూల్ ప్లాన్ దెబ్బతింది.
కాగా తనతో గత రెండు రోజులుగా సన్నిహితంగా ఉన్నవాళ్లందరూ టెస్ట్ చేయించుకోవాలని చరణ్ రిక్వెస్ట్ చేశాడు. కానీ కరోనా వైరస్ సోకిన రెండు వారాల్లో ఎప్పుడైనా అది బయటపడే అవకాశాలు ఉన్నాయని WHO ఎన్నడో వెల్లడించింది. ఇటీవల డిసెంబర్ 25న మెగా ఫ్యామిలీలోని యంగ్‌స్టర్స్ అందరూ కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
ఆ వేడుకల్లో చరణ్-ఉపాసన దంపతులతో పాటు పాటు అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులు, అల్లు బాబీ దంపతులు, శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక-చైతన్య దంపతులు, సుస్మిత దంపతులు, శ్రీజ దంపతులు.. ఇలా ఆ ఫ్యామిలీకి చెందిన పలువురు కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు చరణ్‌కు కొవిడ్-19గా నిర్ధారణ కావడంతో, ఆ వేడుకల్లో పాల్గొన్న వాళ్లంతా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడినట్లే.
![]() |
![]() |