![]() |
![]() |

లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన తమిళ చిత్రం కాదలా కాదలా (తెలుగులో నవ్వండి లవ్వండి)లో లోకనాయకుడు కమల్ హాసన్ తో కలసి నటించారు మల్టిటాలెంటెడ్ ప్రభుదేవా. 1998లో విడుదలైన సదరు హిట్ మూవీ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. కమల్ తాజా చిత్రం విక్రమ్ కోసం దాదాపు 23 ఏళ్ళ తరువాత జట్టుకట్టనున్నారట ప్రభుదేవా.
ఆ వివరాల్లోకి వెళితే.. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ క్యారెక్టర్ ని ప్రభుదేవా చేయబోతున్నట్లు కోలీవుడ్ బజ్. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడం, చాన్నాళ్ళ తరువాత కమల్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కావడంతో.. ప్రభుదేవా ఈ సినిమాని వెంటనే అంగీకరించారట. త్వరలోనే విక్రమ్ చిత్రంలో ప్రభుదేవా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2021 వేసవిలో వెండితెరపై వెలుగులు పంచనుంది.
![]() |
![]() |