![]() |
![]() |

కథానాయకుడిగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ది ఆరేళ్ళ సినీ ప్రస్థానం. ఈ ప్రయాణంలో ఏడు చిత్రాలతో సందడి చేశాడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అల్లుడు అదుర్స్ తనకి 8వ సినిమా. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం.. చిత్రీకరణ తుదిశకు చేరుకుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మౌనీ రాయ్ పై ప్రత్యేక గీతం చిత్రీకరిస్తున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. అల్లుడు అదుర్స్ ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయబోతున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో ఇప్పటివరకు ఏ సినిమా కూడా సంక్రాంతి సీజన్ లో సందడి చేసిన సందర్భం లేదు. కెరీర్ లో తొలి సారిగా పొంగల్ బరిలోకి దిగుతున్నాడు. మరి.. ఫస్ట్ టైమ్ సంక్రాంతి రిలీజ్.. ఈ యంగ్ హీరోకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో తెలియాలంటే జనవరి 15వరకు వేచి చూడాల్సిందే.
అల్లుడు అదుర్స్ లో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోనూ సూద్ కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |