![]() |
![]() |

బుల్లితెర వ్యాఖ్యాత స్థాయి నుంచి వెండితెర నటి స్థాయికి ఎదిగిన వైనం అనసూయ సొంతం. ఒకవైపు ముఖ్య పాత్రల్లోనూ, మరోవైపు ప్రత్యేక గీతాల్లోనూ మెరుస్తున్న ఈ జబర్దస్త్ బ్యూటీ.. ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్టోరియల్ 'రంగమార్తాండ', రవితేజ స్టారర్ 'ఖిలాడి'లో కీలక పాత్రల్లో నటిస్తోంది. అంతేకాదు.. మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ నటించే అవకాశం రంగమ్మత్త దక్కించుకుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సర్కారు వారి పాట'లో అనసూయ ఓ హాస్యభరిత పాత్రలో దర్శనమివ్వనుందట. సినిమా ద్వితీయార్ధంలో అనసూయ పాత్ర ఎంట్రీ ఇస్తుందని.. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ ట్రాక్ లో నవ్వులు పండిస్తుందని సమాచారం. త్వరలోనే 'సర్కారు వారి పాట'లో అనసూయ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న 'సర్కారు వారి పాట'లో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించనుంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు.
![]() |
![]() |