![]() |
![]() |

నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో అలరించే నాయికగా నివేదా థామస్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. జెంటిల్ మ్యాన్, నిన్ను కోరి, 118, బ్రోచేవారెవరురా.. ఇలా పలు చిత్రాల్లో తన అభినయంతో కట్టిపడేసింది నివేదా. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ కోర్ట్ డ్రామా వేసవిలో థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా నివేదాకి కోలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ వరించిందని సమాచారం. కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా ఇరుంబు తిరై (తెలుగులో అభిమన్యుడు), హీరో (తెలుగులో శక్తి) చిత్రాల దర్శకుడు పి.యస్. మిత్రన్ రూపొందించనున్న సినిమాలో నాయికగా నటించే అవకాశం మిస్ థామస్ కి దక్కిందని తమిళ చిత్ర వర్గాల టాక్. త్వరలోనే కార్తి - మిత్రన్ చిత్రంలో నివేదా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. కార్తి, నివేదా జోడీ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |