![]() |
![]() |

వైవిధ్యభరిత చిత్రాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో యంగ్ హీరో నితిన్ నటించిన సినిమా 'చెక్'. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో నితిన్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ దర్శనమివ్వనున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా 'చెక్' కి సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, మరో రెండు వారాల్లో 'చెక్' కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని వినికిడి. అలాగే మార్చిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని బజ్.
మరోవైపు నితిన్ హీరోగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'రంగ్ దే' సంక్రాంతికి కాకుండా ఫిబ్రవరిలో విడుదల కాబోతోందని తెలిసింది. అలాగే నిర్మాణదశలో ఉన్న 'అంధాధున్' రీమేక్ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి వస్తుందని టాలీవుడ్ టాక్.
మరి.. 'భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఆసక్తికర చిత్రాలతో లైనప్ సెట్ చేసుకున్న నితిన్ కి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.
![]() |
![]() |