![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణకి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయులు, శాండల్ వుడ్ స్టార్స్ శివ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ తో మంచి అనుబంధమే ఉంది. ఆ అభిమానంతోనే బాలయ్య వందో
చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో అతిథిగా మెరిశారు శివ రాజ్ కుమార్. ఆ గెస్ట్ రోల్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కట్ చేస్తే.. శివ రాజ్ కుమార్ తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ కూడా నటసింహతో
జట్టుకట్టనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. సింహా, లెజెండ్ తరువాత బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. BB3 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ
చిత్రంలో పునీత్ అతిథి పాత్రలో మెరుస్తారని.. ఇంట్రవెల్ ఎపిసోడ్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా ఆయన సందడి చేయనున్నారని టాక్. త్వరలోనే బాలయ్య, బోయపాటి సినిమాలో పునీత్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మరి.. శివ రాజ్ కుమార్ లాగే పునీత్ రాజ్ కుమార్ కూడా బాలయ్య సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారేమో చూడాలి. 2021 వేసవిలో BB3 థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |