![]() |
![]() |

``తగ్గేదేలే`` అంటూ `పుష్ప - ద రైజ్`తో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. హిందీనాట అనూహ్య విజయం సాధించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తాలూకు సెకండ్ పార్ట్ `పుష్ప - ద రూల్` త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జోరుగా సాగుతోందని బజ్. మొదటి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా.. సెకండ్ పార్ట్ ని డిజైన్ చేస్తున్నారట బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ అండ్ కో.
ఇదిలా ఉంటే, ఈ పాటికే పట్టాలెక్కాల్సిన `పుష్ప - ద రూల్`ని కొన్ని అనివార్య కారణాల వల్ల జూన్ కి వాయిదా వేశారట. ఈ కారణంగా ఈ సంవత్సరాంతంలో `పుష్ప - ద రూల్` రిలీజయ్యే అవకాశం లేనట్టేనని వినిపిస్తోంది. అంతేకాదు.. 2023 సమ్మర్ స్పెషల్ గా ఈ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందని ఇన్ సైడ్ టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, `పుష్ప - ద రూల్`లోనూ రష్మికా మందన్న కథానాయికగా కొనసాగనుండగా.. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతసారథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.
![]() |
![]() |