![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ నేడు(మార్చి 25) విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి సినీ సెలబ్రిటీల నుంచి, క్రిటిక్స్ నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని వెబ్ సైట్స్ ఆర్ఆర్ఆర్ ని టార్గెట్ చేస్తూ దారుణ కామెంట్స్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ పై నెగటివ్ కామెట్స్ చేసే వారిపై సినీ నిర్మాత, వైసీపీ నేత ప్రసాద్ వి.పొట్లూరి(పీవీపీ) ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ సంచలన కామెంట్స్ చేశారు.
"జీవితంలో ఒక షాట్ తియ్యలేదు, ఒక్క రోజు షూటింగ్లో నిలబడింది లేదు.. కానీ అందరికి సినిమాలు తీయడంలో క్లాసులు పీకుతారు.. సినీప్రపంచంలో భయపడుతూ బ్రతికేవాళ్లందరు, మీ కష్టాన్ని అపహాస్యం చేసేవాళ్ళ మీద తిరగపడండి.. Load,aim and shoot your views" అంటూ 'ఆర్ఆర్ఆర్'లోని డైలాగ్ ని ప్రస్తావిస్తూ పీవీపీ ట్వీట్ చేశారు.

"నాకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు.. కాస్త తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా" అంటూ విరుచుకుపడ్డారు. "కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి.. జాతి గర్వించే కథలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి.. మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మన వాడని ఆనంద పడాలి" అంటూ పీవీపీ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
![]() |
![]() |