![]() |
![]() |

`కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న పాన్ - ఇండియా మూవీ `సలార్`. చెన్నై పొన్ను శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వెర్సటైల్ స్టార్ జగపతి బాబు నెగటివ్ రోల్ లో ఎంటర్టైన్ చేయనుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. ఇప్పటివరకు 30 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తిచేసుకుందని సమాచారం.
ఇదిలా ఉంటే, అన్నీ అనుకూలంగా ఉండి ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 14న `సలార్` ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అనివార్య కారణాల వల్ల ఇప్పుడా స్థానంలో `కేజీఎఫ్` సెకండ్ పార్ట్ `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` రిలీజ్ కానుండగా.. `సలార్` వచ్చే సంవత్సరంకి వాయిదా పడింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. 2023 సమ్మర్ రేస్ లో `సలార్` సందడి చేయనుందట. కుదిరితే ఏప్రిల్ లో లేదంటే జూన్ తొలివారంలో ఈ భారీ బడ్జెట్ మూవీ విడుదల కావచ్చని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే `సలార్` రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరి.. యాక్షన్ ప్రియులను టార్గెట్ చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో.. ప్రభాస్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |