![]() |
![]() |
.webp)
బిగ్ బి అమితాబ్ బచ్చన్.. పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు. హిందీనాట తిరుగులేని కథానాయకుడిగా రాణించిన అమితాబ్.. గడిచిన కొద్ది సంవత్సరాలుగా బాలీవుడ్ లో అభినయానికి ఆస్కారమున్న ప్రధాన పాత్రల్లో అలరిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. అడపాదడపా దక్షిణాది భాషల్లోనూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లో అతిథి తరహా పాత్రల్లో పలకరించిన అమితాబ్ బచ్చన్.. త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలోనూ సందడి చేయనున్నారు. మల్టిటాలెంటెడ్ ఎస్జే సూర్య తో కలిసి `ఉయరంద మణిదన్` అనే సినిమాలో నటించబోతున్నారు బిగ్ బి.
ఇదిలా ఉంటే, `ఉయరంద మణిదన్` కంటే ముందు మరో కోలీవుడ్ ప్రాజెక్ట్ లో అమితాబ్ బచ్చన్ దర్శనమివ్వబోతున్నారట. ఆ చిత్రం మరేదో కాదు.. లోక నాయకుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ లో నటిస్తున్న `విక్రమ్`. లోకేశ్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం ద్వితీయార్ధంలో వచ్చే ఓ కీలక సన్నివేశంలో కాసేపు అతిథిగా కనిపిస్తారట అమితాబ్ బచ్చన్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. కాగా, జూన్ 3న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న `విక్రమ్`లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |