![]() |
![]() |

యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం `మాచర్ల నియోజకవర్గం` చేస్తున్నాడు. నూతన దర్శకుడు ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నితిన్ కి జంటగా `ఉప్పెన` భామ కృతి శెట్టి ఎంటర్టైన్ చేయనుంది. ఈ ఏడాదిలోనే ఈ పొలిటికల్ థ్రిల్లర్ జనం ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉంటే, `మాచర్ల నియోజకవర్గం` తరువాత ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్షన్ లో తన తదుపరి చిత్రం చేయనున్నాడు నితిన్. `జూనియర్` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా.. ఈ క్యాలెండర్ ఇయర్ లోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. స్టార్ కంపోజర్ హ్యారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతమందించనున్నారు. కాగా, ఈ సినిమా తరువాత స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట నితిన్. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశముందని సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రానికి కూడా వక్కంతం వంశీ కథను అందించబోతున్నాడట. మరి.. వక్కంతం వంశీ స్క్రిప్ట్స్ తో నితిన్ చేయబోయే ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తనకి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
![]() |
![]() |