![]() |
![]() |

సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఆర్ఆర్ఆర్' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'బాహుబలి' తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బుకింగ్స్ తోనే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి-2 రికార్డు బ్రేక్ చేయడం ఖాయమని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు అత్యధిక షేర్ రాబట్టిన సినిమాల్లో రూ.43 కోట్లతో 'బాహుబలి-2' మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్థానంలోకి ఆర్ఆర్ఆర్ రాబోతోంది. ఫస్ట్ డే ఈ సినిమా 60 కోట్లకు పైగా షేర్ రాబట్టనుంది. నైజాంలో 20 కోట్లు, సీడెడ్ లో 13 కోట్లకు పైగా, ఆంధ్రలో 30 కోట్లు ఓపెనింగ్స్ ని ఆర్ఆర్ఆర్ రాబట్టే అవకాశముందని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా తెలుగు మొదటి రోజు రాష్ట్రాల్లో 62 కోట్ల షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.
ప్రీమియర్స్ తోనే 3 మిలియన్ మార్క్ దాటిన ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ లోనూ 'బాహుబలి-2'ని మించిన కలెక్షన్స్ రాబట్టొచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా మాత్రం 'బాహుబలి-2' ఫస్ట్ డే కలెక్షన్ ని ఆర్ఆర్ఆర్ బీట్ చేసే అవకాశం లేదు. 'బాహుబలి-2' మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 123 కోట్ల షేర్ రాబట్టింది. హిందీలో భారీ ఓపెనింగ్స్ రావడంతో 'బాహుబలి-2'కి ఇది సాధ్యమైంది. కానీ ఆర్ఆర్ఆర్ కి హిందీలో ఆ స్థాయి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ అసలు లేదు. దీంతో ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా దాదాపు 110 కోట్ల షేర్ రాబట్టే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాలలో ఆర్ఆర్ఆర్ 191 కోట్లు బిజినెస్ చేసింది. నైజాం(తెలంగాణ)లోఈ సినిమా 70 కోట్ల బిజినెస్ చేయగా.. ఆంధ్రప్రదేశ్ లో 121 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. సీడెడ్ లో 37 కోట్లు, ఆంధ్రాలో 84 కోట్లు(ఉత్తరాంధ్ర 22 కోట్లు, ఈస్ట్ గోదావరి 14 కోట్లు, వెస్ట్ 12 కోట్లు, గుంటూరు 15 కోట్లు, కృష్ణ 13 కోట్లు, నెల్లూరు 8 కోట్లు) బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.451 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది.
![]() |
![]() |