![]() |
![]() |

బాచిలర్ జీవితమే బెస్ట్ అని మెగా మేనల్లుడు, యువ హీరో సాయి ధరమ్ తేజ్ అంటున్నాడు. అయితే ఫ్యామిలీలో పెద్దలు అలా అనుకోవడం లేదన్నాడు. తనను పెళ్లి చేసుకోమని అంటున్నారని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. పెళ్లి విషయంలో అతడిని ఫ్యామిలీ మెంబర్స్ ప్రెజర్ పెడుతున్నారట.
ఒకరి తర్వాత మరొకరు కజిన్స్ అందరూ హ్యాపీగా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెడుతుంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి చూపు తన వైపే పడుతోందని సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఎన్నాళ్ళు ఇలా సంతోషంగా ఒంటరి జీవితం గడుపుతూ చెప్పలేనని నిట్టూర్చాడు. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి నిశ్చయం అయిన సంగతి తెలిసిందే. అతడి పెళ్లి గురించి కూడా మెగా ఫ్యామిలీ డిస్కస్ చేసుకుంటూ ఉందన్నమాట.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కి సంబంధాలు చూస్తున్నారట. ఏ క్షణమైనా సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్త ప్రేక్షకులు వినే అవకాశం ఉంది.
![]() |
![]() |