Home  »  News  »  'జాంబీ రెడ్డి' సెన్సార్ గ‌డ‌ప దాటాడు!

Updated : Jan 30, 2021

 

డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ రూపొందిస్తోన్న మూడో చిత్రం 'జాంబీ రెడ్డి'తో తేజ స‌జ్జా ('ఇంద్ర‌'లో చిరంజీవి చిన్న‌ప్ప‌టి పాత్ర‌ధారి) హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. లేటెస్ట్‌గా ఈ సినిమా సెన్సార్ ప‌నుల‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుంచి 'జాంబీ రెడ్డి'కి యు/ఎ స‌ర్టిఫికెట్ ల‌భించింది. 

ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ను 'జాంబీ వ‌ర్మ‌'గా మార్చేశారు. సినిమా నిడివి 2 గంట‌ల 5 నిమిషాల‌ని ఆయ‌న తెలియ‌జేశారు. సెన్సార్ నుంచి స‌ర్టిఫికెట్ వ‌చ్చిన విష‌యాన్ని ఓ పోస్ట‌ర్ ద్వారా ఆయ‌న పంచుకున్నారు. దానితో పాటు, "2 Hrs 5 Mins.. #𝐙𝐨𝐦𝐛𝐢𝐞𝐑𝐞𝐝𝐝𝐲 𝐂𝐞𝐧𝐬𝐨𝐫𝐞𝐝 𝐰𝐢𝐭𝐡 𝐔/𝐀! 'cause ZOMBIES Like BIG FAMILIESMan zombieFamily. 7 రోజుల్లో 'నవ్వుల వాక్సిన్' మీ అభిమాన థియేటర్లలో!" అంటూ రాసుకొచ్చారు.

టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌న ముందుకు వ‌స్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం 'జాంబీ రెడ్డి' కావ‌డం గ‌మ‌నార్హం.

నూత‌న సంవ‌త్స‌రారంభం సంద‌ర్భంగా విడుద‌ల చేసిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. దీంతో 'జాంబీ రెడ్డి'పై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఆ అంచ‌నాల‌ను అందుకొనేందుకు ఫిబ్ర‌వ‌రి 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.