![]() |
![]() |

సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'క్రాక్'తో రి-ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ కి.. సదరు కాప్ డ్రామా గ్రాండ్ కమ్ బ్యాక్ మూవీగా నిలవడమే కాదు, 'సలార్' రూపంలో ఓ బిగ్ టికెట్ ఫిల్మ్ ని అనూహ్యంగా అందించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, 'కేజీఎఫ్' కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ యాక్షన్ సాగా కోసం తొలుత కత్రినా కైఫ్, కియారా అద్వాని, దిశా పటాని, శ్రద్ధా కపూర్.. ఇలా పాపులర్ బాలీవుడ్ బ్యూటీస్ పేర్లే హల్ చల్ చేశాయి. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కి కొద్ది రోజుల ముందే శ్రుతి పేరు వెలుగులోకి వచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడు 'సలార్' ఆఫర్ తో మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు శ్రుతి.
ఇదిలా ఉంటే.. 'సలార్' కోసం శ్రుతి తన కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. అక్షరాలా కోటి రూపాయిల పారితోషికాన్ని మిస్ హాసన్ పుచ్చుకుంటున్నారని తెలిసింది. అదే గనుక నిజమైతే.. శ్రుతి అభిమానులకు ఇది ఆనందాన్నిచ్చే అంశమే.
మరి.. 'సలార్'తో శ్రుతి ఫస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |