![]() |
![]() |

యువ సంగీత సంచలనం తమన్ కి సంక్రాంతి సీజన్ తో మంచి అనుబంధమే ఉంది. మిరపకాయ్ (2011)తో మొదలైన తమన్ సంక్రాంతి సినిమాల సందడి.. బిజినెస్ మేన్, బాడీగార్డ్ (2012), నాయక్ (2013), డిక్టేటర్ (2016), అల వైకుంఠపురములో (2020), క్రాక్ (2021) వరకు కొనసాగింది. అంతేకాదు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సర్కారు వారి పాట కూడా 2022 సంక్రాంతికి రాబోతోంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. గత రెండు సంక్రాంతి సీజన్స్ లోనూ తమన్ స్వరసారథ్యంలో రూపొందిన చిత్రాలే పొంగల్ విన్నర్స్ గా నిలిచాయి. 2020 సంక్రాంతికి అల వైకుంఠపురములో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలవగా.. 2021 సంక్రాంతికి క్రాక్ హయ్యస్ట్ గ్రాసర్ అయింది. మరి.. సెంటిమెంట్ రిపీట్ అయి 2022 సంక్రాంతి సీజన్ లోనూ సర్కారు వారి పాటతో తమన్ హ్యాట్రిక్ సంక్రాంతి విన్నర్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న సర్కారు వారి పాటకి గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
![]() |
![]() |