![]() |
![]() |

ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు మెలోడీబ్రహ్మ మణిశర్మ. ప్రస్తుతం ఈ వెటరన్ కంపోజర్ చేతిలో దాదాపు డజను సినిమాలు ఉన్నాయి. వీటిలో నాలుగు చిత్రాలు వేసవిలోనే రాబోతున్నాయి. వాటిలో రెండు బిగ్ టికెట్ ఫిల్మ్స్ ఉండడం విశేషం. ఆ చిత్రాలే.. ఆచార్య, నారప్ప. ఈ రెండు సినిమాలు కూడా జస్ట్ ఒక్క రోజు గ్యాప్ లో వెండితెరపై వెలుగులు పంచనున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఆచార్య.. మే 13న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న నారప్ప.. మే 14న జనం ముందుకు రానుంది. ఇలా.. కేవలం ఒక రోజు గ్యాప్ లో మెలోడీబ్రహ్మ నుంచి రెండు బిగ్ టికెట్ ఫిల్మ్స్ సందడి చేయనున్నాయి.
మరి.. ఈ చిత్రాలతో మణిశర్మ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
అన్నట్టు.. ఈ రెండు సినిమాలను కూడా ఆయా కథానాయకుల హోమ్ బేనర్స్.. మరో సంస్థతో కలసి నిర్మిస్తుండడం విశేషం.
![]() |
![]() |