![]() |
![]() |

మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'రాజా డీలక్స్' అనే టైటిల్ నిర్ణయించినట్లు కూడా ప్రచారంలోకి వచ్చింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నది. ఈ విషయాన్ని ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా ఈరోజు చెప్పారు. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మారుతితో తమ హీరో సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనీ, ఎందుకంటే ఇది మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అనీ తెలిపారు.
ముగ్గురు హీరోయిన్లు ఉండే ఈ సినిమా సబ్జెక్ట్ ఎక్కువగా మన నేటివిటీతో ఉంటుందన్నారు. త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్లే ఈ సినిమా కోసం మారుతి అమేజింగ్ సబ్జెక్ట్‌ను రెడీ చేస్తున్నారని వెల్లడించారు.
కాగా ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను ఇప్పటికే నిర్మించారు. హోలీ పండగ సందర్భంగా మార్చి 18న ఈ సినిమాను ప్రారంభిస్తారని వినిపిస్తోంది. ముగ్గురు హీరోయిన్లలో ఇద్దరు.. మాళవికా మోహనన్, మెహ్రీన్ పిర్జాదా ఇప్పటికే ఎంపికయ్యారని సమాచారం. పూజా హెగ్డే జతగా ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' ఈ నెల 11న విడుదలై, మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో ఆడుతోంది.
![]() |
![]() |