![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ మూవీ 'ప్రాజెక్ట్ K' భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల నాగ్ అశ్విన్ కి, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మా సినిమాకు మీ మద్దతు కావాలని నాగ్ అశ్విన్ కోరగా.. ఆనంద్ మహీంద్రా వెంటనే అంగీకరించారు. అంతేకాదు తాజాగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
ఇటీవల నాగ్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహీంద్రాను ఒక రిక్వెస్ట్ చేశారు. "డియర్ ఆనంద్ మహీంద్రా సర్. మేం 'ప్రాజెక్ట్ k' అనే సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాం. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని వాహనాలను తయారు చేయిస్తున్నాం. అవి ఇప్పటి టెక్నాలజీని మించి, యూనిక్ గా ఉంటాయి. మా దగ్గర ఎంతో ప్రతిభావంతులైన ఇంజినీర్లు, డిజైనర్ లు ఉన్నారు. ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇలాంటి ప్రయత్నం ఇంతకు ముందెప్పుడూ ఎవరూ చేయలేదు. మాకు మీ సహకారం కావాలి. మీరు సహకారం అందిస్తే అది మాకు గౌరవంగా భావిస్తాము" అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ ట్వీట్ కి ఆనంద్ మహీంద్రా రిప్లై ఇచ్చారు. తమ సంస్థ తరఫున 'వేలు మహీంద్రా' సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు.

'ప్రాజెక్ట్ K' కోసం మహీంద్రా సంస్థ రంగంలోకి దిగింది. తాజాగా నాగ్ అశ్విన్ మహీంద్ర రీసెర్చ్ వ్యాలీని సందర్శించారు. వేలు మహీంద్రా మరియు అతని టీమ్ తో తమ జర్నీ స్టార్ట్ అయిందని ట్విట్టర్ వేదికగా చెప్పిన నాగ్ అశ్విన్.. ఆనంద్ మహీంద్రాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
![]() |
![]() |