![]() |
![]() |

కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న లేటెస్ట్ మూవీ 'విక్రమ్'. ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కలిసి నటిస్తుండటం.. 'ఖైదీ', 'మాస్టర్' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వం సినిమా కావడంతో 'విక్రమ్'పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ ను ప్రకటించారు.
నేడు(మార్చి 14) లోకేష్ కనకరాజ్ కావడంతో 'విక్రమ్' విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా జూన్ 3 న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మూవీ మేకింగ్ వీడియోని కూడా విడుదల చేశారు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మేకింగ్ గ్లింప్స్ పేరుతో విడుదలైన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. మేకింగ్ వీడియోని బట్టి చూస్తే ముగ్గురు స్టార్స్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండనున్నాయని తెలుస్తోంది.

రాజ్ కమల్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చి ఈ మూవీ ఈ సమ్మర్ లో విడుదలై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
![]() |
![]() |