![]() |
![]() |

శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన బహుభాషా చిత్రం 'సేవాదాస్'. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని, వినోద్ రైనా-రేఖా నిరోష హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. సుమన్, భానుచందర్, కె.పి.ఎన్. చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే 'సేవాదాస్' చిత్రంలో నటించడం గర్వంగా ఉందన్నారు సుమన్, భానుచందర్. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా 'సేవాదాస్' చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను వారు అభినందించారు.
నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్-బాలు చౌహాన్ మాట్లాడుతూ.. "సేవాదాస్ రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. ఏప్రిల్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల వినోద్ రైనా-రేఖా నిరోష సంతోషం వ్యక్తం చేశారు.
ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరామెన్ గా విజయ్ టాగోర్, ఎడిటర్ గా ప్రదీప్ వర్క్ చేస్తున్నారు.
![]() |
![]() |