![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం `రామారావు ఆన్ డ్యూటీ`, `ధమాకా`, `రావణాసుర` చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వరలో పాన్ - ఇండియా మూవీ `టైగర్ నాగేశ్వరరావు` చేయబోతున్నారు. వీటితో పాటు ఓ మెగా ప్రాజెక్ట్ లోనూ ముఖ్య పాత్రలో నటించబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. చెన్నైపొన్ను శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `మెగా 154` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ఓ స్పెషల్ రోల్ లో దర్శనమివ్వనున్నారని, తన షూటింగ్ పార్ట్ ఏప్రిల్ నెలలో ఉంటుందని సమాచారం. త్వరలోనే `మెగా 154`లో రవితేజ ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
కాగా, చిరంజీవితో ఇదివరకు `ఆజ్ కా గుండారాజ్` (1992), `అన్నయ్య` (2000), `శంకర్ దాదా జిందాబాద్` (2007) వంటి చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు రవితేజ.
![]() |
![]() |