![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పీరియాడిక్ లవ్ స్టోరీ 'రాధేశ్యామ్' శుక్రవారం విడుదలైంది. ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ మంచి కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది. మూడు రోజుల్లో దాదాపు 72 కోట్ల షేర్ రాబట్టి రెబల్ స్టార్ పవర్ ఏంటో చూపించింది.
204 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాధేశ్యామ్ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 71.83 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల బిజినెస్ చేసిన రాధేశ్యామ్.. మూడు రోజుల్లో 48.39 కోట్లు(మొదటి రోజు25.49 కోట్లు, రెండో రోజు 12.32 కోట్లు, మూడో రోజు 10.58 కోట్లు) రాబట్టింది. ఇటీవల విడుదలైన 'భీమ్లా నాయక్(మొదటి రోజు 26.42 కోట్లు, రెండో రోజు 13.14 కోట్లు, మూడో రోజు 13.51 కోట్లు)'తో పోలిస్తే కాస్త తగ్గినప్పటికీ డివైడ్ టాక్ తెచ్చుకున్న లవ్ స్టోరీకి ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం విశేషమనే చెప్పాలి.
ఓవర్సీస్ లో 10.55 కోట్లు రాబట్టిన రాధేశ్యామ్.. హిందీలో 6.80 కోట్లు కలెక్ట్ చేసింది. రెస్టాఫ్ ఇండియా 6.09 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్ లాస్ట్ మూవీ సాహోతో పోల్చి చూస్తే హిందీ ఓపెనింగ్స్ బాగా డల్ అయ్యాయి. హిందీలో 50 కోట్ల బిజినెస్ చేసిన రాధేశ్యామ్ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటాలంటే రాబోయే పదిరోజుల్లో మెజారిటీ కలెక్షన్ రాబట్టాల్సి ఉంది. రాధేశ్యామ్ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఓవరాల్ గా ఇంకా132.17 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. మార్చి 25 న ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల ఉండటంతో.. ఈ పదిరోజుల్లో రాధేశ్యామ్ ఆ టార్గెట్ రీచ్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |