![]() |
![]() |

గతంలో 'కరెంట్ తీగ' (2014), 'గరుడవేగ' (2017) వంటి తెలుగు చిత్రాల్లో సందడి చేసిన శృంగార తార సన్నీ లియోన్.. దాదాపు ఐదేళ్ళ తరువాత మరో టాలీవుడ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఆ చిత్రమే.. `గాలి నాగేశ్వరరావు`. ఇందులో `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ పాయల్ రాజ్ పుత్ ఓ కథానాయికగా నటిస్తుండగా.. సన్నీ లియోన్ మరో లీడ్ రోల్ లో ఎంటర్టైన్ చేయనుంది.
కాగా, `గాలి నాగేశ్వరరావు`లో సన్నీ లియోన్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ వచ్చేసింది. ఇందులో విదేశాల నుంచి స్వదేశంలోని ఓ గ్రామానికి వచ్చే ఎన్నారై మగువ రేణుక పాత్రలో దర్శనమివ్వనుందట సన్ని. ఒకవైపు ఎంటర్టైన్ చేస్తూనే.. మరోవైపు ఎమోషనల్ గా కదిలించేలా ఆమె పాత్ర ఉంటుందని సమాచారం. అంతేకాదు.. మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ముగ్గురు కూడా స్నేహితుల పాత్రల్లో కనిపిస్తారని.. ఈ ముగ్గురూ ఓ గ్రామానికి చెందిన ప్రజల్ని ఎలా ప్రభావితం చేసి వారిని ప్రగతిపథంలో నడిపించారన్నదే సినిమా అని ఇన్ సైడ్ టాక్. మరి.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో సన్నీ లియోన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న `గాలి నాగేశ్వరరావు`కి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు.
![]() |
![]() |